Temper Movie:టెంపర్ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యాడో తెలుసా ?
Temper Movie:టెంపర్ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యాడో తెలుసా.. విప్లవ చిత్రాలతో తనకంటూ ఓ ముద్రవేసుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లా వాసి. తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తం పేదల కోసం వినియోగించిన నారాయణమూర్తి మొదట్లో చిన్నా చితకా పాత్రలు వేసాడు.
అర్ధరాత్రి స్వాతంత్య్రం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేసిన నారాయణ మూర్తి ఆ తర్వాత ఆ ట్రెండ్ తగ్గడంతో హీరోగా వెనుకబడ్డాడు.అయితే క్రియేటివ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో మొదట నారాయణ మూర్తిని ఓ పాత్రకోసం అనుకుంటే ఆయన రిజెక్ట్ చేసాడు.
ఆ సినిమా ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ కి వరుస ప్లాప్ ల నేపథ్యంలో హిట్ మూవీ గా నిల్చిన టెంపర్ మూవీ. అందులో నిజాయితీ గల పోలీసు కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళి బాగా నటించి ఆడియన్స్ మనసు దోచుకున్నాడు.
అయితే ఈ పాత్రకోసం మొదట్లో నారాయణమూర్తిని అనుకున్నారు. అయితే ఆ సినిమా కమర్షియల్ మూవీ కావడంతో తిరస్కరించినట్లు ఓ ఇంటర్యూలో నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. పాత్ర బాగున్నప్పటికీ కమర్షియల్ మూవీ కావడం వలన వదిలేసారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ ,హీరోయిన్ గా కాజల్ అగర్వాల్,ఓ తండ్రిగా తనికెళ్ళ భరణి,సుబ్బరాజు,తదితరులు తమ పాత్రలలో మెప్పించారు.