Dibba rotti recipe: పాతకాలం నాటి కమ్మటి అసలు సిసలైన దిబ్బరొట్టి.. ఇలా చేసి చూడండి
Dibba rotti recipe: పాతకాలం నాటి కమ్మటి అసలు సిసలైన దిబ్బరొట్టి.. ఇలా చేసి చూడండి..ఎంతో ఆరోగ్యకరమైన దిబ్బరొట్టిని, షాప్స్ నుంచి తెచ్చుకునే పనిలేకుండా,ఇంట్లోనే తయారు చేసుకునేలా ఈజీ అండ హెల్తీ దిబ్బరొట్టి రెపీని నేర్చుకోండి.
కావాల్సిన పదార్ధాలు
ఇడ్లీ పిండి – 350 గ్రాములు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూన్స్
నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్
నూనె – 1/3కప్పు
తయారీ విధానం
1.ఇడ్లీ పిండిలో ఉప్పు, జీలకర్ర, కొద్దిగా నీళ్లు వేసి, పిండిని బాగా బీట్ చేసుకోవాలి.
2.అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని, లోపలి వైపు అంతటా ఆయిల్, అప్లై చేసుకోవాలి.
3.నూనె రాసిన మూకుడులో, మిగిలిన నూనె కూడా వేసేసుకోని, దాని పై ఇడ్లీ పిండిని పోసుకోవాలి.
4.ఇప్పుడు నీళ్లు నింపిన ఒక చిన్న గిన్నెను ఇడ్లీ పిండిలో మధ్యలో వత్తిపెట్టాలి.
5.స్టవ్ ఆన్ చేసుకుని, సన్నని మంటపై 25 నిముషాలు, ఉంచాలి
6.ఇప్పుడు 25 నిముషాల తర్వాత, దిబ్బరొట్టి రెడీ అయిందా లేదా తెల్సుకోవడానికి,ఒక టూట్ పిక్ గుచ్చి తీయండి.
7.టూట్ పిక్ క్లీన్ గా వస్తే, దిబ్బరొట్టి లోపల ఉడికినట్లే
8.ఇప్పుడు మధ్యలో అమర్చిన నీళ్ల గిన్నెను మెళ్లగా తీసేసి, అట్లకాడ సాయంతో దిబ్బరొట్టిని బయటికి తీసుకోవాలి.
9.ఇప్పుడు పెనంపై మరో ప్యాన్ పెట్టుకుని,ఆయిల్ వేసి, దిబ్బ రొట్టి పై వైపును, 10 నిముషాలు ఎర్రబడే వరకు కాల్చుకోవాలి.
10.అంతే దిబ్బరొట్టి రెడీ.