Kitchenvantalu

Kadak Rumali Roti: రెస్టారంట్ స్టైల్లోఇంట్లోనే రుమాలి రోటి ఇలా ఈజీ గా చేసుకోండి

Kadak Rumali Roti: రెస్టారంట్ స్టైల్లోఇంట్లోనే రుమాలి రోటి ఇలా ఈజీ గా చేసుకోండి..ఆకలిగా లేకపోయినా,కొన్నిసార్లు టైమ్ పాస్ కోసం,తినాలనిపిస్తుంది.
అందులో పాప్ కార్న్,

బటానీ లాంటివి,తింటూ ఉంటాం.టైమ్ పాస్ కోసం అయితే,కడక్ రుమాలీ రొటీ చేసి చూడండి,భలేగా నచ్చేస్తుంది.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 కప్పు
గోధుమపిండి – 1/2కప్పు
ఉప్పు – తగినంత
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
చాట్ మసాలా – 1/2టీ్స్పూన్
కారం -1/2టీ్స్పూన్
ఉల్లిపాయ తరుగు -1
టమాటో – 1/2కప్పు
టమాటో సాస్ – 1 టీ స్పూన్
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్
ఛిల్లీ ఫ్లేక్స్ – 1 టీ స్పూన్
నిమ్మరసం – ½ టీస్పూన్

తయారీ విధానం

1.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమపిండి, మైదా పిండి, నెయ్యి, తగినంత ఉప్పు వేసి,తగినన్ని నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దగా కలుపుకోవాలి.
2.5 నుంచి 6 నిముషాలు బాగా కలిపాక, 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు చాట్ మసాలా కోసం ఒక గిన్నెలోకి , నెయ్యి వేసుకుని, అందులోకి, చాట్ మసాలా, కారం కలిపి,పక్కన పెట్టుకోవాలి.
4.సలాడ్ కోసం ఉంచిన, టమాటో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో సాస్, చాట్ మసాలా వేసి బాగా కలపి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ పై మూకుడు బోర్లించిపెట్టి, పై భాగంలో నూనెను రాసుకుని, వేడెక్కనివ్వాలి. ఇప్పుడు నానిన పిండిముద్దను,సమానంగా తీసుకుని, పల్చగా వత్తుకుని, ఒక ప్లేట్ సహాయంతో రౌండ్ గా కట్ చేసి, వేడెక్కిన మూకుడు పై వేసుకోవాలి.
6. ఒక నిముషం తర్వాత , రోటీ కాస్త కాలినాక, రోటీని తిప్పుకుని, మరో వైపు వేయాలి.
7. కాలుతున్న రోటీని , కాటన్ గుడ్డతో , అన్ని వైపులా వత్తుతూ రొటీ కాల్చుకోవాలి.
8. కరకరలాడుతూ కాలిన రోటీ పైన, ముందుగా కలిపి ఉంచుకున్న నెయ్యి మిశ్రమం పూసి,ఆ తర్వాత,తయారు చేసుకున్న సలాడ్ వేసి సెర్వ్ చేసుకోవడమే,
9. వేడి వేడి కడక్ రుమాలీ రోటీ తయరైనట్లే..