Beauty Tips

Face Glow Tips:చర్మ కాంతిని పెంచే పండు.. ఇలా వాడితే సరిపోతుంది

Face Glow Tips:చర్మ కాంతిని పెంచే పండు.. ఇలా వాడితే సరిపోతుంది.. కివిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే కివిలో ఉన్న పోషకాలు ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. kiwi తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ kiwi పేస్ట్, అరస్పూన్ పెరుగు, అరస్పూన్ ఆలివ్ oil వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కఠినమైన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది. పెరుగులో లభించే జింక్ మొటిమల వల్ల కలిగే మంటలను తగ్గిస్తుంది.

ఆలివ్ oil లో విటమిన్ ఇ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్దిగా ఉండుట వలన ఎక్స్‌ఫోలియంట్ మరియు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

kiwiలో విటమిన్లు సి మరియు ఇ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రెండు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు…అందువల్ల చర్మానికి పోషణ, తేమ, మృదువుగా, ప్రకాశవంతంగా మరియు ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఈ ప్యాక్ కంటి కింద నల్లని వలయాలను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.