MoviesTollywood news in telugu

Takkari Donga:టక్కరి దొంగ సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Takkari Donga:టక్కరి దొంగ సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు సక్సెస్ గా సాగుతున్నాడు. తెలుగులో కౌబాయ్ చిత్రాలకు సూపర్ స్టార్ కృష్ణ నాంది. ఎన్నో హిట్ మూవీస్ లో ఆయన నటించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం జోడించి తీసిన మోసగాళ్లకు మోసగాడు మూవీ చరిత్ర క్రియేట్ చేసింది.

ఈ మూవీ వచ్చిన 20ఏళ్ల తర్వాత కృష్ణ నటవారసుడు మహేష్ బాబు టక్కరి దొంగ లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ సినిమాకు జయంత్ సి పరాంజీ డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. మొదట్లో ఈ సినిమాను కె ఎస్ రామారావు నిర్మించాలి.

కానీ అప్పటికే రెండు సినిమాలు మాత్రమే హిట్ అయిన మహేష్ తో 5వ సినిమాగా 10కోట్ల బడ్జెట్ తో మూవీ చేయడానికి కె ఎస్ రామారావు వెనకడుగు వేశారు. అయితే ఆయన అనుమతితో ప్రొడ్యూసర్ గా మారిన జయంత్ సినిమాకు రెడీ అయ్యారు. రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. బాలీవుడ్ హీరోయిన్స్ నటించారు

అమెరికాలో కూడా షూటింగ్ ఎక్కువ భాగం తీసి చాలా ఖర్చు పెట్టారు. మహేష్ ఏడాదిపాటు డేట్స్ ఇచ్చారు. అయితే షూటింగ్ మధ్యలో మూడుసార్లు డైరెక్టర్ తో మహేష్ కి గొడవ వచ్చింది.

రైలు దగ్గర రిస్క్ షాట్స్ కోసం డూప్ ని పెడతామంటే వద్దని మహేష్ చేసేసాడు. బ్రిడ్జి ఎపిసోడ్ లో కూడా రిస్క్ చేసాడు. క్లైమాక్స్ లో రోప్ వే దగ్గర కూడా డూప్ లేకుండా నటించాడు. ఇలా మూడు సీన్స్ లో గొడవ పడి మరీ మహేష్ నటించడంతో కృష్ణకు తెల్సి కంగారు పడ్డారు. స్క్రిప్ట్ బలంగా ఉంటె సినిమా ఆడేది. కానీ ఒకే ఫ్యామిలీలో రెండు జనరేషన్స్ కౌబాయ్ మూవీస్ చేసి, మెప్పించడం కృష్ణ, మహేష్ లకే దక్కింది.