Aadavari Matalaku Ardhale Verule: “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమా గురించి ఈ విషయాలు తెలుసా..?
Aadavari Matalaku Ardhale Verule: “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే” సినిమా గురించి ఈ విషయాలు తెలుసా.. విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి.ఇక వెంకటేష్ నటించిన పలు సినిమాలు ఆయనకు బెస్ట్ యాక్టర్‌గా పేరు తేవడమే కాకుండా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచాయి.
ఇందులో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను తమిళ డైరెక్టర్ శ్రీరాఘవ తెరకెక్కించగా వెంకటేష్ సరసన అందాల భామ త్రిష నటించగా వారి కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో వెంకటేష్, త్రిషల మధ్య నడిచే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీకి జనాలు పట్టం కట్టారు.అటు కోట శ్రీనివాస్ రావు, వెంకీల మధ్య నడిచే తండ్రీ కొడుకుల బంధం కూడా అంతే బాగా చూపించారు.
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇప్పటికీ టీవీల్లో అలరిస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యినిన్నటికి (27-04-2024) 17 ఏళ్లు పూర్తయ్యింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా సూపర్ సక్సె్స్ అయ్యింది.ఈ చిత్రం భారీ విజయం సాధించడంలో సంగీతం కూడా పెద్ద పాత్ర పోషించదని చెప్పాలి.