MoviesTollywood news in telugu

Actress Bhavana : గోపీచంద్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..

Actress Bhavana : గోపీచంద్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా.. తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ఒంటరి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళ హీరోయిన్ భావన తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈమె తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.

అయినప్పటికీ ఎందుకో తెలుగులో అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.దీంతో ఇక చేసేదేమీ లేక ఈ అమ్మడు తన మకాం ని తమిళ్ సినీ పరిశ్రమకు మార్చింది.అయితే అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.మరోపక్క మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అప్పుడప్పుడు అవకాశాలతో అలరించింది.

అయితే 2017 సంవత్సరంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంది భావన.కానీ తెలుగులో మాత్రం చివరగా 2009వ సంవత్సరంలో శ్రీకాంత్ నటించిన టువంటి మహాత్మ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విడుదలై దాదాపు 11 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు భావన తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

అయితే అప్పట్లో ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ పారితోషికం విషయంలో దర్శక నిర్మాతలను బాగా డిమాండ్ చేసిందని అందువల్ల కొందరు దర్శకనిర్మాతలు పక్కన పెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

దీనికితోడు అప్పట్లో భావనని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో కొంత కాలం వివాదాలతో కోర్టులు చుట్టూ తిరిగింది ఈ అమ్మడు. భావన ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తున్నారు.