MoviesTollywood news in telugu

Tollywood: రవితేజ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఏమి చేస్తుందో..

Neninthe Fame Heroine Siya Gautam : రవితేజ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఏమి చేస్తుందో.. ఇండస్ట్రీలోని వాళ్ళ కష్టాలను వాస్తవంగా తెరకెక్కించిన మూవీస్ లో రవితేజ హీరోగా చేసిన నేనింతే సినిమాను ప్రధానంగా చెప్పుకోవాలి.

రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తో పోలిస్తే నేనింతే పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది ఫాన్స్ ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, బెస్ట్ సినిమాల లిస్ట్ లో నేనింతే కూడా ఉంటుందని అంటారు.

ముఖ్యంగా రవితేజకు నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ కి ఇదే తొలి మూవీ. సియా గౌతమ్ కి అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. అంతేకాదు, అదే ఆమె అసలు పేరట. తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా అదితి గౌతమ్ అని ఇప్పటికీ ఉంటుంది.

ప్రస్తుతం ముంబై లో ఉంటున్న సియా గౌతమ్ సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు. నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమె ఆ తర్వాత 2016 లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించింది. సంజయ్ దత్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజు లో సంజయ్ సోదరి ప్రియాదత్ పాత్రలో సియా గౌతమ్ ఒదిగిపొయింది.