Healthhealth tips in telugu

Joint Pains: కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కీళ్ల మధ్య శబ్దం తగ్గి జీవితంలో అసలు ఉండవు

Joint Pains: కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కీళ్ల మధ్య శబ్దం తగ్గి జీవితంలో అసలు ఉండవు.. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి శరీరంలో calcium తగ్గిపోవడం, శరీరంలో వాతం పెరగడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. శరీరంలో వాతం పెరగడం వలన నడిచినప్పుడు ఎముకల మధ్య శబ్ధం వస్తుంది.
Joint pains in telugu
ఈ శబ్దం అనేది ఎముకల మధ్య గ్యాప్ లో లుంబ్రికెంట్స్ తగ్గిపోవడం వలన జరుగుతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే చాలా సింపుల్ గా మన ఇంటిలో ఒక పొడి తయారుచేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి తయారు చేసుకుని ప్రతి రోజు తాగితే కీళ్ల మధ్య గ్రీజ్ పెరిగి నడిచినప్పుడు టక్ టక్ అని శబ్ధం తగ్గడమే కాకుండా నడుం నొప్పి, కాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి,భుజం నొప్పి ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
Sonthi Health benefits In Telugu
ముందుగా శొంఠి కొమ్ములను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి కోసం 50 గ్రాముల శొంఠి పొడి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వామును మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలుపుకొని తాగితే శరీరంలో వాతం తగ్గుతుంది. అలాగే కీళ్ల మధ్య గ్రీజు పెరిగి శబ్దం రావడం తగ్గుతుంది. శరీరంలో వాతం తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెంతులు నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
Joint Pains Home Remedies in telugu
ప్రతిరోజూ ఈ పొడిని తీసుకుంటూ అరగంట వ్యాయామం చేస్తే చాలా తొందరగా నొప్పులు తగ్గుతాయి. వాము,మెంతులు,శొంఠి ఈ మూడింటిలోనూ నొప్పులను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అశ్రద్ద చేయకుండా ఈ పొడిని తయారుచేసుకొని ప్రతి రోజు తీసుకుంటే నొప్పులు తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.