Joint Pains:అరస్పూన్ నీళ్ళలో కలిపి తాగితే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరుగుతుంది
Joint Pains:అరస్పూన్ నీళ్ళలో కలిపి తాగితే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరుగుతుంది.. కీళ్ల మధ్య జిగురు అనేది కీళ్ళు సాఫీగా కదిలేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి కీళ్ళు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ రెమిడీ ఫాలో అవ్వవచ్చు.
దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ముందుగా 50 గ్రాముల శొంఠిని ముక్కలుగా కట్ చేసి నూనె లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము తీసుకొని పాన్ లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. మెంతులు,వాము పొడిలో శొంఠి పొడిని కలపాలి.
ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజులు తాగితే చాలా తేడా కనిపించి ఆశ్చర్యం కలుగుతుంది.
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లే మేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పి,వాపును తగ్గించటంలో సహాయపడతాయి. శొంఠిలో ఉన్న లక్షణాలు కీళ్ల వాపులను తగిస్తాయి. ఈ పొడి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.