Good Sleep:ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది…
Good Sleep:ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది… నడుం వాల్చగానే నిద్ర పట్టటం నిజంగా అదృష్టమే! కానీ ఈ అదృష్టం అందరికీ ఉండదు. కానీ ‘మైండ్‌ఫుల్ బ్రీతింగ్’ ప్రాక్టీస్ చేస్తే నిమిషంలో నిద్ర పట్టటం ఖాయం.పరీతమైన ఒత్తిడి, ఆందోళనతో ఉండేవాళ్లు ఊపిరి పీల్చటం మీద దృష్టి పెట్టరు. గుండెల నిండా గాలి పీల్చకపోగా, కొన్ని క్షణాలపాటు గాలి పీల్చటమే ఆపేస్తుంటారు.
ఇదే పరిస్థితి రాత్రివేళ వాళ్లని నిద్రపోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. శరీరం రిలాక్స్ అవాలంటే గుండె వేగం తగ్గి, మనసు ప్రశాంతమవ్వాలి. ఇలా జరగాలంటే అందుకు తగినంత ఆక్సిజన్‌ను శరీరానికి అందించాలి. ఈ సూత్రంగా తయారైన టెక్నిక్ ‘మైండ్‌ఫుల్ బ్రీతింగ్’.
మైండ్‌ఫుల్ బ్రీతింగ్ ఇలా
నిటారుగా కూర్చుని 4 సెకండ్ల పాటు ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చుకోవాలి. అలాగే ఆ గాలిని 7 సెకండ్లపాటు పట్టి ఉంచాలి. తర్వాత నోటి ద్వారా 8 సెకండ్ల పాటు గాలిని బయటికి వదిలేయాలి. ఈ బ్రీతింగ్ టెక్నిక్‌నే 4-7-8 ట్రిక్ అని కూడా అంటారు.
మొదట్లో గబగబా అంకెలు లెక్కపెట్టేయటం, రెండోసారి ప్రాక్టీస్ చేయటానికి బద్దకమనిపించటం లాంటి ఇబ్బందులు మామూలే! కానీ పట్టుదలగా మనసుపెట్టి ప్రాక్టీస్ చేస్తే సరిగ్గా నిమిషంలో నిద్రలోకి జారుకుంటారు. ట్రై చేసి చూడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.