Healthhealth tips in telugu

Weight Loss Drink:ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

Weight Loss Drink:ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది.. అధిక బరువు, శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఆయుర్వేదంలో నిమ్మరసం, బెల్లం కలిపిన డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చని చెప్పుతున్నారు. అధిక బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Jaggery Health Benefits in Telugu
నిమ్మ‌ర‌సంలో ఉండే పాలీఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు బ‌రువును త‌గ్గించ‌డంలో అద్భుత‌మైన పాత్ర పోషిస్తాయి. ఇవి కొవ్వును క‌రిగిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బెల్లం విషయానికి వస్తే శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.

బెల్లం జీర్ణ ప్రక్రియ వేగవంతం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. ప్రతి రోజు నిమ్మరసం,బెల్లం కలిపి తీసుకోవటం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ బెల్లం తురుము వేసి బాగా కలిసేలా కలపాలి.
weight loss
ఈ డ్రింక్ ని ప్రతి రోజు ఉదయం సమయంలో తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి ముందు అరగంట కడుపు ఖాళీగా ఉండాలి. 15 రోజులు తాగితే ఆ తేడా చూసి ఆశ్చర్యం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.