Varalakshmi Vratam 2024: వరలక్ష్మి వ్రతంలో సాధారణంగా అందరూ చేసే పొరపాట్లు… మీరు చేస్తున్నారా?
Varalakshmi Vratam 2024: వరలక్ష్మి వ్రతంలో సాధారణంగా అందరూ చేసే పొరపాట్లు… మీరు చేస్తున్నారా.. శ్రావణమాసం అనగానే అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం మాత్రమే పూజ చేయాలా లేదా శ్రావణమాసం మొత్తం పూజించవచ్చా వంటి అనేక సందేహాలు చాలా మందికి ఉంటాయి.
అలాగే చాలా మంది కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనలో చాలా మంది శ్రావణమాసం లక్ష్మీదేవికి పూజ చేస్తే ధనం బాగా వస్తుందని అనుకుంటూ ఉంటారు.కానీ శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అందరి మీద ఆధిపత్యం లభిస్తుంది. ఆధిపత్యం ఆంటే ఎదుటివారు మన మంచితనాన్ని చూసి గౌరవం ఇవ్వటం అని అర్ధం. అలాగే చుట్టూ ఉన్న అందరూ అనుకూలంగా ఉంటారు.
శ్రావణమాసంలో వరలక్ష్మివ్రతం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలని అనుటు ఉంటారు కదా అందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. లక్ష్మీదేవికి జపం అంటే చాలా ప్రీతి. అందువల్ల లక్ష్మి దేవికి జపం చేస్తే ఎక్కువ ప్రీతి చెంది మనం అనుకున్న కోరికలు నెరవేరతాయి. అయితే నైవేద్యం అనేది మన శక్తి కొలది పెట్టవచ్చు.
లక్ష్మీదేవికి నైవేద్యం అనేది మనస్సుపూర్తిగా ఆనందంగా చేయాలి. ఆనందంగా ఒక నైవేద్యం పెట్టిన అమంవారి కటాక్షం కలుగుతుంది. నైవేద్యం అనేది హృదయపూర్వకంగా చేయాలి. ప్రతి రోజు లక్ష్మి నామాలు పఠిస్తే డబ్బును సంపాదించే బుద్దిని కలిగిస్తుంది. కానీ డబ్బు ఆలా వచ్చేయదు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ముత్తయిదువులకు తాంబులం ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత మందికి ఇవ్వాలని అంటే, అమ్మవారికి 8 అంటే చాలా ఇష్టం కాబట్టి 8 మంది ముత్తయిదువులకు ఇస్తే మంచిది.
ఒకవేళ ఎక్కువ మందికి ఇచ్చిన పర్వాలేదు. ఒకవేళ 8 మంది ముత్తయిదువుల కన్నా తక్కువ మంది ఉంటే ఎంత మంది తక్కువగా ఉన్నారో అన్ని తాంబులాలు అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. తాంబులం అనేది ముత్తయిదువులకు మధ్యాహ్నం 12 గంటల లోపు ఇవ్వాలి.
లక్ష్మీదేవిని శ్రావణమాసంలోనే పూజిస్తేనే అమ్మవారి కటాక్షం కలుగుతుందా లేదా ఏ నెలలో చేసిన అమ్మవారి కటాక్షం కలుగుతుందా? అమ్మవారిని ఎవరు మనసుపూర్తిగా పిలుస్తారో వారి ఇంటికి వస్తుంది. గర్భవతులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా…కొబ్బరికాయ కొట్టవచ్చా…. పళ్ళను వాయనంగా ఇవ్వవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది.
గర్భవతులు 5 నెల లోపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టటం,పళ్ళను వాయనంగా ఇవ్వటం,ఉపవాసం ఉండటం వంటివి చేయకూడదు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం కుదరకపోతే ఆ తర్వాతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు.
కలశంలో పెట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా అంటే ఏమి జరగదు. ఎందుకంటే కలశంలో కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయ బనే ఉంటుంది. అలాగే భక్తి శ్రద్దలతో పూజ చేస్తాం కదా. ఆ తర్వాత కుళ్ళితే మనం ఏమి చేయలేము కదా.