MoviesTollywood news in telugu

Raghavendra Movie: ప్రభాస్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..

Raghavendra Movie: ప్రభాస్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా.. రంగుల ప్రపంచం మాయలోకం ఇలా సినిమా పరిశ్రమకు ఎన్నో పేర్లు. ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. లేకుంటే పత్తాలేకుండా పోతారు.

ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన “రాఘవేంద్ర” మూవీలో రెండో హీరోయిన్ గా శ్వేత అగర్వాల్ నటించింది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలను సమకూర్చారు. కానీ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ మాత్రం ఉన్నట్లుండి తెరమరుగైంది.
Telugu heroine swetha agarwal
అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే టాప్ హీరోల్లో ఒకరు గా పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. రాఘవేంద్ర చిత్రంలో నటించిన ఐదు సంవత్సరాల గ్యాప్ అనంతరం ఆంగ్లంలో “తందూరి లవ్” అనే చిత్రంలో హీరోయిన్ గా శ్వేత అగర్వాల్ చేసింది.

కానీ ఈ చిత్రం కూడా ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చివరగా బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన “షాపిత్” అనే హార్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.

ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ ఆతర్వాత శ్వేత అగర్వాల్ కనిపించలేదు. నారాయణ్‌తో ప్రేమలో పడి.. వివాహం చేసుకుంది. ఆదిత్య మరెవ్వరో కాదూ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు. అంటే శ్వేతా ఉదిత్ నారాయణ్ ఇంటి కోడలు.

వీరికి ఓ పాప. ఆదిత్య నటుడే కాదూ సింగర్, హోస్ట్ కూడా. ఇక శ్వేతా అగర్వాల్ సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే.. కాస్త బొద్దుగా కనిపిస్తుంది కానీ .. అందం ఏమాత్రం తగ్గలేదు. అలాగే భర్త, మామకు సంబంధించిన కాన్సర్ట్ వివరాలు షేర్ చేస్తూ ఉంటుంది.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK