Tollywood directors:మన స్టార్ దర్శకులకు శిక్షణ ఇచ్చిందెవరో తెలుసా?
Tollywood directors:మన స్టార్ దర్శకులకు శిక్షణ ఇచ్చిందెవరో తెలుసా.. ఒక డైరెక్టర్ తన ప్రతిభను చూపించాలంటే,మరొకరి దగ్గర శిష్యరికం చేసి,తన పనితనానికి మెరుగు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా రాణిస్తున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎవరో ఒకరు దగ్గర పనిచేసినవారే. శివ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పూరి జగన్నాధ్ తర్వాత స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే వర్మ దగ్గర ఇప్పటికీ ఓ స్టూడెంట్ లా మెలుగుతాడు. వర్మ దగ్గర కృష్ణ వంశీ కూడా అసిస్టెంట్ గా చేసాడు.
డైరెక్టర్ తేజ కూడా వర్మ స్కూల్లోనే అసిస్టెంట్ గా చేసాడు. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మొదట్లో ఎడిటింగ్ వర్క్ నేర్చుకుని కె రాఘవేంద్రరావు దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దగ్గర బోయపాటి శ్రీను సహాయ దర్శకుడుగా చేసాడు. గోకులంలో సీత,పెళ్లి చేసుకుందాం, అన్నయ్య,పవిత్ర ప్రేమ వంటి సినిమాలకు పనిచేసాడు.
శ్రీను వైట్ల గురువు ఈవీవీ సత్యనారాయణ. గురుభక్తితో ఈవీవీ తనయుడు ఆర్యన్ రాజేష్ తో సొంతం మూవీ చేసాడు. దిల్ సినిమా సమయంలో వివి వినాయక్ దగ్గర సుకుమార్ డైరెక్టర్ గా పనిచేసాడు. రచయిత,డైరెక్టర్ పోసాని కృష్ణమురళి దగ్గర రైటర్ గా పనిచేసిన కొరటాల శివ రైటర్ గా అనుభవం గడించాడు. నిజానికి పోసానికి కొరటాల దగ్గర బంధువే. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ తొలిగురువు పోసాని కృష్ణ మురళి అయినప్పటికీ డైరెక్టర్ కె విజయభాస్కర్ దగ్గర రైటర్ గా ఉంటూనే డైరెక్షన్ మెళుకువలు నేర్చుకున్నాడు.
స్వయంవరం,నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావలి మూవీస్ కి రైటర్ గా పనిచేసిన త్రివిక్రమ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో సభ్యుడిగా కొనసాగాడు. యండమూరి వీరేంద్ర నాధ్ కి ఏకలవ్య శిష్యుడిగా చెప్పుకునే హరీష్ శంకర్ , నిజానికి కోన వెంకట్,పూరి జగన్నాధ్,రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజాల వద్ద పనిచేసాడు. ఈశ్వర్ సినిమాకు పనిచేసిన వంశీ పైడిపల్లి ఆతర్వాత మాస్, వర్షం సినిమాలకు అసిస్టెంట్ గా చేసి,బోయపాటి బద్రి సినిమాకు కూడా అసిస్టెంట్ గా చేసి,మున్నాతో డైరెక్టర్ అయ్యాడు.
తమ్ముడు సినిమా డైరెక్ట్ చేసిన అరుణ్ ప్రసాద్ కి ఎఫ్ 2డైరెక్టర్ అనిల్ రావిపూడి దగ్గర బంధువు. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకు పనిచేసి, సౌర్యం మూవీతో డైలాగ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసాడు. డాన్ శ్రీను , బలుపు సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని గురువు కూడా శ్రీను వైట్ల. అందరి వాడు,వెంకీ,ఢీ సినిమాలకు పనిచేసిన వెంకీ,ఇంకా స్టాలిన్ ,లక్ష్యం,కంత్రి,భిల్లా సినిమాలకు కూడా సహాయకుడిగా పనిచేసాడు. దర్శకుడిగా మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ అయితే శేఖర్ కమ్ముల దగ్గర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాడు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK