Clove: రోజూ రెండు జస్ట్ 2 లవంగాలు తినండి.. మార్పు మీరే గమనిస్తారు..
Clove: రోజూ రెండు జస్ట్ 2 లవంగాలు తినండి.. మార్పు మీరే గమనిస్తారు… లవంగం చూడటానికి చిన్నగా ఉన్నా సరే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు తెలియకపోవటం వలన మనలో చాలా మంది లవంగంను కేవలం మసాలా దినుసుగానే వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా వాడటం మొదలు పెట్టి ఆ ప్రయోజనాలు అన్ని పొందుతారు.
రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున లవంగాల నీటిని త్రాగాలి. నానిన లవంగాలను చప్పరిస్తూ నమిలేయాలి. లవంగాలలో ‘యూజెనాల్’ అని పిలువబడే ముఖ్యమైన సమ్మేళనము ఉంటుంది. ఇది శరీరంలో స్వేచ్చగా సంచరిస్తూ శరీర కణాలను నష్టపరిచే ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకోవడం ద్వారా సహజ ప్రతిక్షకారిణి వలె పనిచేస్తుంది.
అంతేకాక కాలేయ పనితీరు బాగుండేలా చేయటం మరియు కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన మంచి కొవ్వును అందించటం మరియు కాలేయంలో ఏర్పడే మంటను తగ్గించటానికి సహాయాపడుతుంది. లవంగాలలో ఉండే మాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరచి వయస్సు పెరిగే కొద్దీ వచ్చేఅల్జీమర్స్ రాకుండా చేయటమే కాకుండా జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది.
లవంగాలలో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండుట వలన తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి వాటికి కారణం అయిన బ్యాక్టీరియాను నివారిస్తుంది. లవంగాలు మధుమేహం నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది. లవంగాలలో ఉండే ‘నైలిసిసిన్’ అనేసమ్మేళనం రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. నైలిసిసిన్ అనేది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు లవంగాల నీటిని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. లవంగాలు మంచి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతి రోజు లవంగాల నీటిని త్రాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే పంటి నొప్పి,కేవిటీస్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.
నోటి దుర్వాసన తొలగిస్తుంది. అలాగే వికారం,వాంతులు,అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే శరీర అధిక బరువును తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ సాయపడతాయి. చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు లవంగం నీటిని తాగుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.