Healthhealth tips in telugu

Coffee: ఉదయాన్నే కాఫీ తాగే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే..!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే.. కాఫీ తాగడం అనేది చాలామందిలో వుండే అలవాటు. కాఫీ తాగటం వల్ల అనవసరపు కొవ్వుపై కొంతమేర ప్రభావం చూపిస్తుంది. అందుకే కొంత మంది రన్నర్‌లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువుగా కాఫీని తాగేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువుగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు కూడా అలసిపోవచ్చు.దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. కాఫీ కన్నా టీ తాగటం కొంతవరకు మంచిదని చెప్పాలి.
coffee and cinnamon benefits
టీలో థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం వల్ల అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే, అప్పుడు కాఫీని రోజుకు 2 నుంచి 3 చిన్న కప్పులకే పరిమితం చేయండి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి అనర్ధమే కదా.
Black Coffee benefits
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.