Kitchenvantalu

Garlic Jeera Rice: లంచ్ బాక్స్ కోసం అదిరిపోయే వెల్లుల్లి రైస్..

Garlic Jeera Rice: లంచ్ బాక్స్ కోసం అదిరిపోయే వెల్లుల్లి రైస్..బిర్యాని, ఫ్రైడ్ రైస్, జీరా రైస్, అనగానే,అల్లం దట్టించి చేస్తుంటారు.కొన్నిసార్లు వెల్లుల్లి ఘాటు కూడా ట్రై చేయండి.అదేనండీ వెల్లుల్లి తో జీరా రైస్ తయారు చేయండి.వేడి వేడిగా స్పైసీ స్పైసీగా చల్లని వాతావరణంలో భలేగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి బియ్యం – 1 కప్పు
ఉప్పు – 2 టీ స్పూన్స్

జీరా రైస్ కోసం..
నూనె – 2 టీ స్పూన్స్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
దాల్చిన చెక్క – 1 ఇంచ్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 4
ఎండు మిర్చి – 2
పచ్చిమిర్చి – 02
ఉప్పు – కొద్దిగా
మిరియాల పొడి – 1/2టీస్పూన్
కొత్తిమీర తరుగు – చిన్నకట్ట

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పైన, ఎసరు పెట్టుకుని, మరిగాక, నానపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి, తగినంత ఉప్పు వేసుకుని, హై ఫ్లేమ్ పై 90 శాతం ఉడికించుకోవాలి.
2.ఇప్పుడు ఆ అన్నాన్ని, జారి గరిటెతో తీసి, గాలికి పూర్తిగా ఆరనివ్వాలి.ఠ
3. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టి, అందులోకి నెయ్యి వేడి చేసి, దాల్చిన చెక్క, జీలకర్ర, చిటపటలాడేవరకు వేయించుకోవాలి.
4. అందులోకి వెల్లుల్లి, ఎండు మిర్చి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
5. ఇప్పుడు వేగిన వెల్లుల్లిలోకి పచ్చిమిర్చి ముక్కలు వేసి, 30 సెకండ్ల్ వేపాలి.
6. తర్వాత , అందులోకి చల్లారిన అన్నం వేసి, మిర్యాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు యాడ్ చేసి , హై ఫ్లైమ్ పెట్టుకుని, అట్లకాడతో అన్నాన్ని టాస్ చేయాలి.
7. టాస్ చేసిన రైస్ ను వేడి వేడిగా సెర్వ్ చేసుకుంటే, రుచి అదిరిపోతుంది