Kitchenvantalu

Masala Idli Fry:మసాలా ఇడ్లీ ఫ్రై చాలా రుచిగా 5 నిమిషాల్లో ఇలా చేయండి.. చాలా ఇష్టంగా తింటారు

Masala Idli Fry:మసాలా ఇడ్లీ ఫ్రై చాలా రుచిగా 5 నిమిషాల్లో ఇలా చేయండి.. చాలా ఇష్టంగా తింటారు..బాగా ఆలోచిస్తే, ఏ వంటకం వృధా అవ్వకుండా,
మిగిలిపోయిన వంటలను కూడా,వెరైటీగా ప్లాన్ చేసుకోవచ్చు.

చల్లారిపోయిన ఇడ్లీలను ,వేడి వేడిగా ఫ్రై చేసుకోండి.మదరాసీ స్ట్రీట్ ఫుడ్ గా ,ఎంతో ఫేమస్ అయిన,ఫ్రై ఇడ్లీ మీ మెనూలో యాడ్ చేసి చూడండి.

కావాల్సన పదార్ధాలు
చల్లారిన ఇడ్లీలు – 6
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
తరిగిన ఉల్లిపాయలు – 1/2కప్పు
పచ్చిమిర్చి -2
ఉప్పు – తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – 1 స్పూన్
టమాటో ముక్కలు – 1 కప్పు
నీళ్లు – 1/3కప్పు
నిమ్మరసం – 1 స్పూన్
గరం మసాల- 1/4 టీస్పూన్
కొత్తిమిర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేసి ,అందులోకి అవాలు, కరివేపాకు వేసి వేపుకోవాలి.
2.అవి వేగాక, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, వేసి, హై ఫ్లేమ్ పై ఉల్లిపాయలు, రంగు మారే వరకు వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు మెత్తపడ్డాక, ధనియాల పొడి, కారం, వేసి, హై ఫ్లేమ్ పై కాసేపు వేపుకోవాలి.
4.ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసి, గుజ్జు గజ్జు అయ్యే వరకు వేపుకోవాలి.
5. టమాటో ముక్కలు గుజ్జుగా తయారయ్యాక, అందులోకి నిమ్మరసం, నీళ్లు పోసి,హై ఫ్లేమ్ మీద, నీరు ఇంకే వరకు ఉడికించాలి.
6. కొద్దిగా నీరు ఉండగా, ఆ గ్రేవీ లోకి ఇడ్లీ ముక్కలను వేసి, గ్రేవీ అంతా, ఇడ్లీలోకి, పట్టుకునేంతవరకు,వేపు కోవాలి.
7. అంతే వేడి వేడి గా ఇడ్లీ ఫ్రై రెడీ.