Tirumala:తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికీ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
Tirumala:తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికీ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన.. తిరుమలకు వెళ్ళే వారు ఇప్పుడు చెప్పే విషయాన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.
ఈ రోజుల్లో భక్తులు అధికంగా వస్తారు. అందువల్ల వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రుల దర్శనం టిటిడి రద్దు చేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను కూడా చాలా పరిమితం చేసింది.
అందువల్ల తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది. బ్రహ్మోత్సవాలు సమయంలో భారీగా రద్దీ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తిరుమల వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.