Devotional

Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే కోరికలు నెరవేరతాయి

Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే కోరికలు నెరవేరతాయి..ఆగస్ట్ 26 సోమవారం రోజు కృష్ణాష్టమి పండుగను జరుపు కోనున్నారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.

జన్మాష్టమి రోజు పూజలో కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే ప్రసన్నుడు అయ్యి మీ మనసులోని కోరికలను నెరవేరుస్తారు. కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొత్తిమీరతో తయారుచేసిన పదార్ధాలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీ ఖండ్ సమర్పిస్తే మంచి జరుగుతుంది. దీనిని పెరుగుతో తయారుచేస్తారు. మఖన్ మిశ్రీ సమర్పిస్తే జీవితంలో ఆనందం ఉంటుంది. మనస్సులో కోరుకున్న కోరికలు నెరవేరతాయి. అలాగే మాల్పువా ,మోహన్ భోగ్ లను కూడా సమర్పిస్తారు.

మోహన్ భోగ్ ని గోధుమపిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించి పంచదార పొడి కలిపి తయారుచేస్తారు. వీటిని సమర్పించినప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి.

త్వియః వాస్తు గోవింద తుబ్యామేవ సమర్పే
గృహ సంముఖో భూత్వ ప్రసిద్ధ పరమేశ్వర..