Belly Fat:బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గాలంటే రోజూ ఈ ఒక్కటి తీసుకోండి చాలు!!
Belly Fat:బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గాలంటే రోజూ ఈ ఒక్కటి తీసుకోండి చాలు.. మన ఆరోగ్యం కాపాడుకునే విషయంలో మనం రోజువారి తీసుకునే డైట్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.
ఇలాంటి పరిస్థుతులలో జీలకర్ర, అల్లంతో తయారు చేసిన డికాషన్ ప్రతిరోజు తీసుకుంటే మన శరీర బరువు తగ్గించుకోవడానికి అది ఒక ఔషధంలా పనిచేస్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ శక్తిని పెంచుతుంది. హెమరాయిడ్స్ మరియు గ్యాస్ నివారిస్తుంది. జీలకర్రలో ఉండే విటమిన్ సి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తిని కూడ పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఒత్తిడి తగ్గించడమే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. జీలకర్ర ఆస్త్మా మరియు శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అదేవిధంగా పురాతన కాలం నుండి అల్లంను వంటలకే కాకుండా ముఖ్యమైన ఔషధంగా కూడ ఆయుర్వేద మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు.
అల్లంలో ఉండే న్యూట్రీషియన్స్ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో అల్లం ఎంతగానో సహ కరిస్తుంది. ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీనితో ఇన్ని అద్భుత గుణాలు ఉన్న అల్లం మరియు జీలకర్ర డికాషన్ ను తీసుకుంటే మన శరీర బరువు మనకు తెలియకుండానే పూర్తిగా తగ్గి పోతుందని లేటెస్ట్ గా జరిగిన ఆయుర్వేద అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
అల్లం జీలకర్ర డికాషన్ తయారీ : ముందుగా ఒక గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇంకొంచెం సేపు మరిగిస్తే డికాషన్ రెడీ. ఈ డికాషన్ లో తేనే లేదా కొద్దిగా బెల్లం వేసుకుని తాగచ్చు. రోజుకి రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.