Over Weight : పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు… కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది…!!
Over Weight : పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు… కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది… ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు .
మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గటానికి., శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అల్లం ముక్కలను వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే నిమ్మ,అల్లంలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి.
ఇప్పుడు ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా తాగటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. నిమ్మకాయ,అల్లం లో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి, శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడతాయి.
ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ ని 5 రోజులు తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరల 5 రోజులు తాగాలి. ఈ విధంగా 2 నెలల పాటు తాగితే మంచి ఫలితం కలుగుతుంది.