Healthhealth tips in telugu

Weight Loss Drink:ఈ డ్రింక్ తాగితే వారం రోజుల్లో మీ పొట్ట,అధిక బరువు,కొలెస్ట్రాల్ తగ్గటం ఖాయం

Weight Loss Drink:ఈ డ్రింక్ తాగితే వారం రోజుల్లో మీ పొట్ట,అధిక బరువు,కొలెస్ట్రాల్ తగ్గటం ఖాయం.. అధిక బరువు అనేది ఈ రోజుల్లో చాలా మందికి సమస్యగా మారింది. దీంతోపాటు పొట్ట కూడా ఎక్కువగా ఉండడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి అధిక బరువు లేకపోయినా పొట్ట మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ పొట్టను కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
Weight Loss tips in telugu
ఎన్ని ప్రయత్నాలు చేసిన పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెప్పబోయే  డ్రింక్ మీ శరీరంలోని కొవ్వుని,పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. ఈ డ్రింక్ తయారుచేయడానికి నాలుగు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అన్ని మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ డ్రింక్ తయారుచేయటం కూడా చాలా సులభం. 

సబ్జా గింజలు
సబ్జా గింజలను బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. సబ్జాలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది. సబ్జా గింజలలో కాల్షియం, ప్రోటీన్, పాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం,విటమిన్ బి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీవ క్రియ రేటును పెంచి మలబద్దకం మరియు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 
Weight Loss Drink In Telugu Dalchina Chekka
దాల్చిన చెక్క పొడి
దాల్చినచెక్క పొడి రక్త నాళాల్లోని కొవ్వును కరిగిస్తుంది. అలాగే శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుంది. గుండెను,మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవ క్రియలను మెరుగుపరుస్తుంది.
lemon benefits
నిమ్మరసం
గ్యాస్‌, ఏసీడీటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి వాటిని తగ్గిస్తుంది.
Honey
తేనే
తేనెలో స్వల్ప మొత్తంలో విటమిన్ మరియు మినరల్’లను కలిగి ఉంటుంది, వీటిలో నియాసిన్, పాంటోథీనికి ఆసిడ్, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్పరస్, పొటాషియం మరియు జింక్ వంటి మూలకాలను కలిగి ఉంటుంది.
Weight Loss Tips in telugu
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి అరగంట సేపు నానబెట్టాలి. అరగంట అయ్యాక సబ్జా గింజలు బాగా ఉబ్బి ఉంటాయి. ఈ సబ్జా గింజల పానీయంలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున,రాత్రి పడుకొనే ముందు త్రాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.