Brahmamudi serial: బ్రహ్మముడి సీరియల్ కనకం గురించి ఈ విషయాలు తెలుసా..?
Brahmamudi serial: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో అత్యధిక రేటింగ్‌తో ముందుకు దూసుకుపోతున్న ధారావాహికగా నిలిచిన ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో టాలీవుడ్ హీరో, బిగ్ బాస్ సీజన్ 5లో మూడవ రన్నరప్‌గా నిలిచిన మానస్ నాగుల పల్లి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గత సంవత్సరం జనవరిలో మొదలైన ఈ సీరియల్ కి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది.
ఈ సీరియల్‌లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. స్వరాజ్ వర్ధన్ అలియాస్ రాజ్ పాత్రలో మానస్ అభినయం అద్భుతంగా ఉంది. కావ్య పాత్రలో దీపికా రంగరాజు నటిస్తున్నారు. అప్పు, రుద్రాణీ, ధాన్యలక్ష్మీ, అనామిక, కనకం వంటి మిగిలిన మహిళా పాత్రలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. కావ్య, స్వప్న, అప్పు తల్లిగా కనకం పాత్రలో నటించిన నటి గురించి మీకు తెలుసా?
బ్రహ్మముడి సీరియల్‌లో కనకం అలియాస్ కనకేశ్వరి పాత్రను నీపా అనే తమిళ నటి పోషిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు వామన్, మాలిని తమిళంలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు. తెలుగు చిత్రం మాణిక్యంలో ‘కొండపల్లి మన్ను’ పాటకు వారు కొరియోగ్రాఫీ చేశారు. నీపా కూడా ఒక కొరియోగ్రాఫర్ మరియు నటి. బాల నటిగా అనేక సీరియల్స్‌లో నటించి, తర్వాత కొరియోగ్రాఫర్‌గా మరియు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.
పదో తరగతి వరకు చదివిన ఆమె, తమిళ సినిమాలకు మరియు తెలుగు సీరియల్ ‘ఔను వాళిద్దరు ఒక్కటే’లో నటించారు. శివ అనే వ్యక్తిని వివాహమాడిన తర్వాత కొంత కాలం కెరీర్‌లో విరామం ఇచ్చిన ఆమె, తర్వాత తిరిగి ‘మైనా’ అనే తమిళ సీరియల్‌తో నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమెకు ఒక పాప మరియు బాబు ఉన్నారు. బ్రహ్మముడి ధారావాహిక తర్వాత ఎన్నో రోజుల గ్యాప్ అనంతరం, తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను చెప్పుకొచ్చింది. ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో హీరోయిన్ దీపికా తమిళ అమ్మాయి. మేము సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాము. నాకు నా భర్త సపోర్ట్ పూర్తిగా ఉండటంతో పిల్లలను తనే చూసుకుంటారని చెప్పింది. ఆమె 10 ఏళ్ల కూతురుకు డయాబెటిస్ ఉంది. చిన్నతనం నుండి ఆమెకు ఇన్సులిన్ ఇస్తున్నారట.
పాపకు రెండున్నర ఏళ్ల వయసులో షుగర్ ఉందని తెలిసి, డిప్రెషన్‌కు లోనైనప్పుడు, ఆమె భర్త ఆమెను నటనలో ప్రోత్సాహించాడు. బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను ఆమె గుర్తు చేసుకుంది. మానస్ చాలా తక్కువ మాట్లాడుతాడు, కానీ మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతాడు అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు మరియు తమిళ ధారావాహికలలో నటిస్తున్నారు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ