Beauty Tips

Coffee For Face:కాఫీ పౌడర్‌లో వీటిని కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం తెల్లగా మెరుస్తుంది

Coffee For Face:ముఖం అందంగా తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చులో ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది.

కాఫీ చర్మానికి చాలా మేలును చేస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, మరియు ఇది చాలా సులభంగా అనుడుబతులో ఉంటుంది. ఈ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఇంటిలో లభ్యమయ్యే పదార్థాలతో కాఫీ ఫేస్‌ప్యాక్‌ను సులభంగా వేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో చూడండి.

కావలసిన పదార్థాలు:

– పసుపు
– పెరుగు
– కాఫీ పొడి

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేసి, అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీస్పూన్ పసుపు వేసి అన్నింటిని బాగా కలిసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసి, 10 నిమిషాల పాటు ఉంచి,ఆ తర్వాత నీటితో కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే తొందరగా పలితం వస్తుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ