Healthhealth tips in telugu

Gas Problem:గ్యాస్‌తో పొట్ట గడబిడగా ఉందా. ఇంటి చిట్కాలతో ఇలా చెక్‌ పెట్టండి

Gas problem:ఆహార అలవాట్లలో మార్పులు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తినడం వల్ల ఇటీవల అనేక మంది కడుపులో గ్యాస్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీర్ణ క్రియలో సమస్యల వల్ల కడుపులో అసౌకర్యం సాధారణంగా మారింది. కొంచెం తిన్నా కూడా కడుపు ఉబ్బి, గ్యాస్‌ వేధించడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది వెంటనే ఏదో ఒక ట్యాబ్లెట్‌ లేదా టానిక్‌ వాడుతున్నారు.

అయితే ఈ చికిత్సలు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా.. సమస్య మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. నిపుణులు చెప్పే కొన్ని సహజ చిట్కాలను అనుసరించి గ్యాస్‌ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తగినంత నీరు తాగకపోవడం వలన జీర్ణ సమస్యలు మరియు గ్యాస్ సమస్యలు ఏర్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల రోజుకు సరిపడా నీరు తాగడం అవసరం. చల్లని వాతావరణంలో కొందరు నీరు తాగడం మానేస్తారు. కానీ నిపుణులు రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని సిఫార్సు చేస్తున్నారు.. దాహం ఉన్నా లేకున్నా తప్పనిసరిగా తాగాలి.

ఆహారంలో పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా చేర్చాలి. ఇలాంటి ఆహారం నిత్యం తినడం వలన జీర్ణ సమస్యలు రావు. కడుపు తేలికగా ఉండి, జీర్ణం త్వరగా జరిగి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.

నిపుణుల ప్రకారం, జీర్ణవ్యవస్థ బాగుండి గ్యాస్‌ సమస్యలు తగ్గించుకోవాలంటే నిరంతరం వ్యాయామం అవసరం. వ్యాయామం ద్వారా శరీరం కేవలం ఫిట్‌గానే కాదు, జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

అనేక మంది ఆహారం తినే సమయంలో భోజనాన్ని త్వరగా నమిలి మింగుతుంటారు. ఈ అలవాటు జీర్ణ సమస్యలకు కారణం అవుతుందని నిపుణుల మాట. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి మింగడం ముఖ్యం. దీనివల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.. గ్యాస్ సమస్యలు రావు.

నిపుణుల ప్రకారం, ఒత్తిడి జీర్ణ సమస్యలకు మూలకారణంగా ఉండవచ్చు. అందువల్ల ఒత్తిడి తగ్గించే చర్యలు అవసరం. యోగా మరియు ధ్యానం వంటి పద్ధతులను జీవనశైలిలో భాగంగా చేర్చుకోవడం ముఖ్యం.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ