Kitchenvantalu

Kitchen Hacks: ఫ్రిజ్‌లో నుంచి వచ్చే దుర్వాసన పోగొట్టాలంటే.. ఇలా చేస్తే సరి..

Kitchen Tips:ఏ ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం సాధారణం. పెద్ద ఫ్రిజ్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు, ఎందుకంటే వాటిలో అనేక వస్తువులు ఉంచవచ్చు. ఫ్రిజ్ ఉంటే దాని ఉపయోగాలు అనేకం. మనం వాడేవి, వాడనివి అన్నీ దానిలో ఉంచుతున్నాం. గతంలో మిగిలిన కూరలను పడేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.

పండ్లు, కూరగాయలు, పువ్వులు ఇలా అనేక రకాలు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ ఫ్రిజ్‌లో అనేక రకాల వస్తువులు ఉండటం వల్ల దుర్వాసన రావచ్చు, ఇది కొంచెం ఇబ్బందికరం. మీ ఫ్రిజ్ నుంచి వాసన వస్తున్నా ఈ చిట్కాలు ప్రయత్నించండి, ఫ్రిజ్‌లోని చెడు వాసన పోతుంది. మరి దుర్వాసన తొలగించే చిట్కాలు ఏమిటో చూద్దాం.

ఫ్రిజ్ నుండి దుర్వాసన రావడం జరుగుతుంది. అయితే, ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించి.. త్వరగా తొలగించాలి. ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి మరిచిపోవడం వల్ల కూడా చెడు వాసన ఏర్పడుతుంది. కావున ముందుగా వాటిని గుర్తించి వాటిని తొలగించాలి.

నిమ్మతొక్కలను ఉపయోగించి కూరగాయలు, ఆహారం, మరియు పువ్వులు త్వరగా కుళ్ళిపోవడం నివారించవచ్చు. ఈ పదార్థాల వలన ఫ్రిజ్‌లో చెడు వాసన ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి ఒక చిన్న ప్లేట్ లేదా బౌల్ తీసుకోండి.. దానిలో నిమ్మ తొక్కలు, ఉప్పు, మరియు బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఇది సహజ డియోడరైజర్‌గా పనిచేసి చెడు వాసనను తొలగిస్తుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ