Beauty Tips

Camphor for Dandruff: కొబ్బరి నూనె,కర్పూరం కలిపి తలకు పట్టిస్తే.. ఏమి అవుతుందో..

Camphor For Dandruff:మన పూర్వీకులు కొబ్బరి నూనెను జుట్టు సంరక్షణకు పురాతన కాలం నుంచి వాడుతున్నారు. దక్షిణ భారతదేశంలో కొబ్బరి నూనెను వంటలలో కూడా వాడుతారు. అలాగే కర్పూరం ప్రతి రోజు ప్రతి ఇంటా వినియోగంలో ఉండే వస్తువు. ఈ రెండు పదార్థాలను కలిపి చుండ్రు సమస్యను సులభంగా నివారించవచ్చు.

కర్పూరం చర్మం మరియు సౌందర్య సంరక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరం మరియు కొబ్బరి నూనెను కలిపి తయారు చేసిన మిశ్రమం యొక్క ప్రాధాన్యత అనేక మందికి తెలియదు. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కండిషనర్లుగా పనిచేస్తాయి.

అలాగే దానిని అప్లై చేయడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఈ నూనెలో యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా వర్షాకాలంలో తలపై ఫంగల్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కర్పూరం యాంటీసెప్టిక్ మరియు యాంటీఫంగల్ గుణాలతో పనిచేసి వాపు సమస్యలను చక్కగా నివారిస్తుంది. చుండ్రు మరియు ఫంగస్ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. కర్పూరం వాడటం వల్ల జలుబు తగ్గించవచ్చు. అలాగే ఇది వెంట్రుకల ఆరోగ్యంలో కూడా చాలా సహాయపడుతుంది. కర్పూరం తలపై రక్త ప్రసరణను కూడా సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

శిరోజాల ఆరోగ్యం కొరకు కర్పూరం మరియు కొబ్బరి నూనె చాలా ముఖ్యమైనవి. వీటిని కలిపి వాడితే వాటి గుణాన్ని మెరుగుపరచవచ్చు. కానీ కర్పూరం మరియు కొబ్బరి నూనెను తలకు నేరుగా అప్లై చేయకూడదు. కొన్ని నియమాలను పాటించాలి. అలా చేస్తే, తల చర్మం చుండ్రు ఫంగస్ నుండి రక్షించబడుతుంది.

అరకప్పు కొబ్బరి నూనెలో ఒక గ్రాము కర్పూరం కలిపి దానిని బాగా కరిగించాలి. ఈ మిశ్రమం తలస్నానం చేసే ముందు తలపై రాయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 నుండి 3 సార్లు ఈ విధానం పాటిస్తే చుండ్రు తగ్గిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ