Healthhealth tips in telugu

Diabetes: డయాబెటిస్ తో బాధపడుతున్నారా.? ఈ జ్యూస్‌లు తాగితే ఇట్టే కంట్రోల్‌

Diabetes Control Juices:డయాబెటిస్‌ రాగానే దానిని సులభంగా తగ్గించలేము. ఈ వ్యాధి సోకినప్పుడు, జీవనశైలిని పూర్తిగా మార్చాలి. ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతిదీ మార్చుకోవాలి. జ్యూసులు తాగే విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. అయినా నిపుణులు చెప్పిన కొన్ని జ్యూస్‌లు డయాబెటిస్‌ బాధితులకు చాలా ఉపయోగపడతాయి.

షుగర్ రోగులకు ఉసిరి రసం చాలా ఉపయోగకరం. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, హైపోగ్లైసీమిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనబడతాయి.

షుగర్ రోగులకు కాకరకాయ రసం కూడా మంచిది. దీని చేదు రుచి ఉన్నా సరే తాగటం మంచిది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు ఐరన్ వంటి పోషకాలు బాగా ఉంటాయి. ఇది ఇన్సులిన్‌లా పనిచేసి బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్యారెట్ జ్యూస్ షుగర్ రోగులకు చాలా ఉపయోగకరం. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సరైన పరిమాణంలో క్యారెట్ జ్యూస్ తాగితే, షుగర్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

సాధారణంగా పాలకూరను కూరగా వాడుతాం. కానీ, పాలకూర జ్యూస్ తాగడం ద్వారా మనకు అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో గ్లైసెమిక్ సూచిక తక్కువ ఉండి, ఇది బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది.

పుచ్చకాయను డయాబెటిస్‌ రోగులు తినకూడదని సాధారణ భావన. కానీ, పుచ్చకాయ రసంలో ప్రోటీన్‌, ఫైబర్‌, మరియు కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు బహుళంగా ఉండి, టైప్ 2 డయాబెటిస్‌ సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడతాయని నిపుణుల అభిప్రాయం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ