Vinayaka Chavithi Pooja Samagri:వినాయక చవితి పూజకు కావలసిన పూజా సామాగ్రి లిస్ట్
Vinayaka Chavithi Pooja Samagri:వినాయక చవితి పండుగను ఇష్టపడని వారు ఉండరు. సాధారణంగా, పండుగలను ఇంటిలో కుటుంబం, బంధువులు, మిత్రులతో కలిసి జరుపుకుంటారు. కానీ వినాయక చవితి పండుగను మాత్రం ఊరంతా ఒక్కటై సందడిగా జరుపుకుంటారు. మరి, బొజ్జ గణపయ్య పూజకు అవసరమైన సామగ్రి ఏమిటి? మీ అందరి కోసం ఇదిగో పూజ సామగ్రి జాబితా. ఈ జాబితా ప్రకారం అన్ని ఉంటే, గణపతి పూజ సిద్ధమైనట్లే!
వినాయకచవితి పూజ సామగ్రి :
పసుపు
కుంకుమ
గంథం
పన్నీరు
పువ్వులు
అరటిపండ్లు
తమలపాకులు
వక్కలు
పాలవెల్లి
పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు, మొక్కజొన్న కంకులు
ఉమ్మెత్తకాయ
కొబ్బరికాయ
పసుపు గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క
అక్షింతలు
మామిడాకులు
అరటి పిలకలు
అరటి ఆకులు
దీపారాధన కుందులు
దీపారాధన వత్తులు
ఆవునెయ్యి/నువ్వుల నూనె (దీపారాధనకు)
అగర్బత్తీలు
కర్పూరం బిళ్లలు
అగ్గిపెట్టె
ఆచమనం కోసం పంచపాత్ర, ఉద్ధరిణి
కలశం కోసం చెంబు
నీళ్లు (అవకాశం ఉంటే గంగా జలం)
వినాయకుని ఆసనం
పూజ చేసే వారికి ఆసనం
విఘ్నేశ్వరుని ప్రతిమ
వినాయకునికి యజ్ఞోపవీతం
వినాయకునికి వస్త్రం
వినాయకుని పూజ కోసం పత్రి
మాచీపత్రం
బృహతీపత్రం
బిల్వపత్రం (మారేడు దళం)
దూర్వారయుగ్మము (గరిక )
దత్తూర పత్రం
బదరీ పత్రం (రేగు ఆకు )
అపామార్గపత్రం
తులసీపత్రం
చూతపత్రం
కరవీరపత్రం
విష్ణుకాంతపత్రం
దాడిమీపత్రం
దేవదారుపత్రం
మరువకపత్రం
సింధువారపత్రం
జాజీపత్రం
గండకీపత్రం
శమీపత్రం
అశ్వత్తపత్రం
అర్జునపత్రం
అర్కపత్రం
మొత్తం 21 రకాల పత్రాలుపూజ పూర్తి అయిన తర్వాత వినాయకుని 21 లేదా 11 లేదా 9 లేదా 5 మీ శక్త్యానుసారం పిండివంటలతో, పప్పు కూర పులుసు పచ్చడి వంటి అనుపానాలతో మహా నైవేద్యం. చివరగా తాంబూలం, దక్షిణ సమర్పించాలి. ఇంకెందుకు ఆలస్యం. ఈ పూజా సామాగ్రి పట్టిక ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుందాం. వినాయక చవితి పండుగను ఏ లోటు లేకుండా ఆనందంగా జరుపుకుందాం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ