MoviesTollywood news in telugu

Tollywood: పవన్ కల్యాణ్‌ పక్కన ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫేమస్

Tollywood: పవన్ కల్యాణ్‌ పక్కన ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫేమస్..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యొక్క క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖుల వరకు అందరూ పవన్‌ను అమితంగా అభిమానిస్తారు. పై ఫొటోలో పవన్ పక్కన ఉన్న బక్కపల్చగా ఉన్న అబ్బాయి కూడా ఆ కోవకే చెందినవాడు. పవన్ కల్యాణ్‌ను విపరీతంగా అభిమానించే టాలీవుడ్ సెలబ్రిటీల్లో అతను ఒకడు.

సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం స్వయంకృషితో పైకొచ్చిన వారిలో అతను కూడా ఒకడు. సినిమాలకు రాకముందు ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని, వెనకడుగు వేయకుండా, ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొంది, సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన ఊపునిచ్చే నృత్యాలతో స్టార్ హీరోలకు ఇష్టమైన కొరియోగ్రాఫర్‌గా మారాడు.

కేవలం టాలీవుడ్ హీరోలకే కాదు, కన్నడ, తమిళ్, బాలీవుడ్ హీరోలకు కూడా నృత్యాలు సమకూర్చాడు. ముఖ్యంగా మెగా హీరోలకు ఇష్టమైన నృత్య మాస్టర్‌గా పేరొందాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లో కూడా ఉన్న అతను మరెవరో కాదు, జానీ మాస్టర్. పై ఫొటో విషయానికి వస్తే, అది పవన్ కల్యాణ్ నటించిన ‘బాలు’ సినిమా సెట్‌లోనిది.

జానీ మాస్టర్ 2009లో నితిన్‌ అభినయించిన ద్రోణ చిత్రంతో డ్యాన్స్‌ మాస్టర్‌గా తెలుగు సినిమా పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన రామ్‌ చరణ్‌తో ‘రచ్చ’, ‘నాయక్‌’, ‘ఎవడు’, ‘రంగస్థలం’, అల్లు అర్జున్‌తో ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసు గుర్రం’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురములో’, ఎన్టీఆర్‌తో ‘బాద్షా’, ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత వీర రాఘవ’, రామ్‌ పోతినేనితో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి అనేక హిట్‌ చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేశారు.

తమిళంలో దళపతి విజయ్‌తో, కన్నడలో సుదీప్‌ కిచ్చాతో, బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో కూడా పనిచేశారు. పవన్‌ కల్యాణ్‌ను గౌరవించే జానీ మాస్టర్‌, జనసేన పార్టీలో చేరి, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ