Healthhealth tips in telugu

Chamomile Flowers Uses:చామంతి మొక్క ఇంటిలో ఉంటే ఎన్నో రోగాలకు చెక్..

Chamomile Flowers:చామంతి పూల సీజన్ ప్రారంభం అయింది. చామంతి పూలకు చూడగానే సాధారణంగా మనకు పూజలే గుర్తొస్తాయి, కానీ ఈ పూలకు ఎన్నో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పూలలోని సువాసన అత్యంత మధురంగా ఉంటుంది. చాలా మంది ఈ మొక్కలను ఇంటిలో పెంచుకుంటారు, అయితే చామంతి పూలను ఉపయోగించి ఆరోగ్యం, అందంను పెంచుకోవచ్చు.

చామంతి పూలను ఉపయోగించి ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. చామంతి పూలతో టీ కూడా తయారుచేయవచ్చు. వారానికి ఒకసారి ఈ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మార్కెట్‌లో చామంతి పూల టీ ప్యాకెట్లు కూడా లభ్యమవుతున్నాయి.

కానీ మనం ఈ టీని ఇంట్లో కూడా సులభంగా తయారుచేయవచ్చు. ఈ చామంతి పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. మరి ఈ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

చామంతి పూల టీ తాగడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటాం. ప్రస్తుత కాలంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారింది. అలాగే మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ టీ తాగడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ టీ శరీరానికి మరియు మనసు రిలాక్స్ అయ్యేందుకు సహాయపడుతుంది.

నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు చామంతి పూల టీ తాగడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగడం వల్ల గాఢమైన నిద్ర పొందవచ్చు. ఏమైనా కంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఇమ్యూనిటీ పెరగడం ప్రస్తుత కాలంలో ఎంతో ముఖ్యం. శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు సులభంగా జబ్బులు వస్తాయి. చామంతి పూల టీ తరచూ తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో పోరాడే శక్తిని అందిస్తుంది. అదనంగా జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి.

చామంతి పూలను చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు ఎండిన చామంతి పువ్వుల పొడి, ఒక స్పూన్ ఎర్ర కొంది పప్పు పొడి, మరియు కొంత రోజ్ వాటర్ కలిపి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి సున్నితంగా రుద్దాలి.

పది నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం ద్వారా నల్లటి మచ్చలు మరియు మొటిమలు తగ్గి ముఖం సాఫ్ట్‌గా ఉంటుంది, ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ