Beauty Tips

Hair Care Tips:ఈ పువ్వు పూజకు మాత్రమే కాదు.. జుట్టు ఒత్తుగా పెరగటానికి కూడా..

Hair Care Tips: మందార పువ్వు పూజకు మాత్రమే కాదు, దీనిలో ఎన్నో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. ఈ పువ్వులో అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, జుట్టుకు, ముఖానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

చర్మం కోసం ఫేస్ ప్యాక్: మందార పువ్వులను ఉపయోగించి మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. మందార పువ్వును మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి చర్మానికి అప్లై చేసి అరాకా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

టోనర్: మంచి స్కిన్ టోనర్ కూడా పనిచేస్తుంది. దీని కోసం మీరు మందార పువ్వులను నీటిలో ఉడికించి చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి టోనర్‌గా ఉపయోగించవచ్చు.

జుట్టు కోసం: మంచి ఒత్తైన జుట్టు కోసం హెయిర్ మాస్క్‌గా మందార పువ్వులను ఉపయోగించవచ్చు. మందార పువ్వును మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొబ్బరి నూనె లేదా పెరుగును జోడించి 25 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ పేస్ట్ జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టును మృదువుగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ