Beauty Tips

Onion For Face:ఉల్లిపాయతో ఇలా చేస్తే పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పవచ్చు

Onion For Face:తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారు… అలా ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఉల్లిపాయ చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ముఖంపై తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే, మీరు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఉన్న క్రీమ్స్‌కు ప్రత్యామ్నాయంగా, ఇంట్లోనే ఉల్లిపాయతో మీరు ఈ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీ లో వేసి పేస్టుగా మార్చండి. ఈ పేస్టు నుండి రసాన్ని బయటకు తీయండి. రసాన్ని ఓ క్లాత్ లో వేసి పిండితే సరిపోతుంది. ఉల్లిపాయ రసాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతాలలో రాయండి. దాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. అరగంట తర్వాత సాధారణ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ రసంలో శనగ పిండి, పసుపు, పెరుగు వంటి పదార్థాలను కూడా కలిపి అప్లై చేయవచ్చు. ఇలా చేసినా మంచి ఫలితం పొందవచ్చు. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే మీ ముఖం పై మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయి. ఉల్లిపాయ రసం అప్లై చేసిన తరువాత మీకు అలర్జీ లేదా అసౌకర్యం ఉంటే వెంటనే మానేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ