Healthhealth tips in telugu

Peach: పీచు పండు కనిపిస్తే వదిలి పెట్టకుండా తినండి.. పోషకాల పుట్ట

Peach: పీచు పండు కనిపిస్తే వదిలి పెట్టకుండా తినండి.. పోషకాల పుట్ట.. కొన్ని రకాల పండ్లు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల పండ్లు దాదాపుగా అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి పండ్లలో పీచు పండు ఒకటి.

పీచు పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం నివారించడంలో మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పీచు పండులో సమృద్దిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

పీచు పండు గుండ్రంగా ఉండి మెత్తటి చర్మంతో ఉంటుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, పొటాషియం, మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.

పీచు పండులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వయసుతో వచ్చే చర్మ సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

పీచు పండులో విటమిన్ A అధికంగా ఉనుద్త వలన కళ్ల ఆరోగ్యం మరియు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పీచు పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పీచు పండులో విటమిన్ C అధికంగా ఉండడం వల్ల, రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ