Kitchenvantalu

Monsoon Kitchen Tips:వర్షాకాలంలో వండిన ఆహారం పాడైపోకుండా ఉండాలంటే..

Monsoon Kitchen Tips:వర్షాకాలంలో వండిన ఆహారం పాడైపోకుండా ఉండాలంటే.. సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.

వర్షాకాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వండిన ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. ఒక్కోసారి వర్షాకాలంలో ఆహార పదార్థాలు బూజు పట్టి పాడైపోతూ ఉంటాయి. చెమ్మ, తేమ వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవుతాయి.

ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే వంట గదిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉంటాయి. వంట గదిలో గాలి బాగా వచ్చేలా చూసుకోవాలి. గదిలోని కిటికీలు, తలుపులను తెరిచి ఉంచాలి. గాలి చల్లగా రావడానికి ఫ్యాన్ వాడవచ్చు. వంటగది ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పదార్థాలను నిలువ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించాలి.

మాంసాలు, చీజ్‌ల వంటి తొందరగా పాడైపోయే వాటిని తప్పనిసరిగా ఫ్రిజ్ ఉంచి, వాటి ఎక్ప్సైరీ డైట్ దాటిపోకుండా వాడేసేలా చూసుకోండి. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏమిటంటే వర్షాకాలంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగినట్లయితే, వంటగదిలో వేడిని తగ్గించడానికి కొంత సమయం పాటు ఫ్యాన్‌లను ఆఫ్ చేయాలి. ఇలా చేయటం వలన ఆహారం తేమ కారణంగా పాడవకుండా ఉంచడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ