Healthhealth tips in telugu

Drink For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలి

Drink For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ డ్రింక్ తీసుకోవాలి.. ఈ మధ్యకాలంలో ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇది చిన్న సమస్యగా కనబడుతుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది.

ఒత్తిడి అనేది మన శరీరం మొత్తం మీద ప్రభావాన్ని చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి ప్రభావం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాక ఒత్తిడి కారణంగా కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి.
Ginger benefits in telugu
శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అందుకే ఒత్తిడి ఉన్నప్పుడు వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఒత్తిడి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
Pachi Pasupu Kommu Benefits in telugu
ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది వయస్సుతో సంబందం లేకుండా ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇప్పుడు చెప్తే డ్రింక్ తీసుకుంటే ఒత్తిడి తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అర అంగుళం అల్లం ముక్కని తీసుకుని తొక్క తీసి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అర అంగుళం పసుపు కొమ్మును తీసుకుని తొక్క తీసి సన్నగా తురుముకోవాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక తురిమిన అల్లం, పసుపు వేయాలి. ఆ తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి ఒక స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఒత్తిడి అనిపించినప్పుడు తలనొప్పి ఉన్నప్పుడు ఈ డ్రింకి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
Honey benefits in telugu
బాడీ అలాగే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ డ్రింక్ ని వారంలో రెండుసార్లు తీసుకుంటూ ఉంటే రోగ నిరోధక శక్తి బలోపేతం అయ్యి సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు మరియు శ్వాస సంబంధ సమస్యలు ఏమి ఉండవు. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ముఖ్యంగా ఈ సీజన్ లో తాగితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ