Kitchenvantalu

Aloo Matar Masala curry:ఆలూ బఠాణి కుర్మా ఈ సారి ఇలా ఈజీగా చెయ్యండి చాలాటేస్టీగా ఉంటుంది

Aloo Matar Masala curry:ఆలూ బఠాణి కుర్మా ఈ సారి ఇలా ఈజీగా చెయ్యండి చాలాటేస్టీగా ఉంటుంది.. బంగాళదుంప అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.

ఆలు కుర్మా అనగానే, అందరికి తెల్సిన వంటకమే.కాని, ఎప్పుడూ ఒకేలా కాకుండా, అందరిలా కాకుండా, కొన్ని కొన్ని టిప్ప్ తో చేస్తే,రుచి మరింత పెరుగుతుంది.
ఆ టిప్స్ ఏంటో మీరు కూడా తెల్సుకోండి.

కావాల్సిన పదార్ధాలు
ఆలు – 150 గ్రాములు
బటాని – 1/2కప్పు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉల్లిపాయలు -2
టమాటో పేస్ట్ – 2 కప్పులు
పచ్చిమిర్చి -2
ఉప్పు – తగినంత
కారం – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – 1/2టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
ధనియాల పొడి – 1/2టీస్పూన్
గరం మసాల – 1/4టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నెయ్యి – 2 టీ స్పూన్స్

తయారీ విధానం
1.నీళ్లలో తొక్క తీసిన ఆలు ముక్కలు, నానపెట్టిన బఠానీలు వేసి, కొంచం పసుపు వేసుకుని,మీడియం ఫ్లేమ్ పై ఆలు ఉడికే వరకు ఉడికించుకోవాలి.
2. ఇప్పుడు వేరొక పాన్ లోకి నూనె వేసుకుని, అందులోకి, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి ముక్కులు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. వేగిన ఉల్లిపాయల్లోకి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం, పసుపు, ధనియాల పొడి,జీలకర్ర పొడి, గరం మసాల వేసి, ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులోకి టమాటో పేస్ట్ ను వేసి, నూనె పైక తేలేంతవరకు వేపుకోవాలి.
5. ఇప్పుడు అందులోక తగినన్ని నీళ్లు పోసి, ఉడికిన ఆలుని మ్యాష్ చేసుకుని, అందులో వేసుకోవాలి.
6. హై ఫ్లేమ్ పై మగ్గనివ్వాలి.
7. మరుగుతున్న కుర్మాలో పైకి తేలుతున్న నురుగను, తీసి వేయాలి.
8. ఇప్పుడు నాలుగు నుంచి ఐదు నిముషాలు ఉడికిన తర్వాత, ఉడికించిన ఆలు బఠాని వేసి, సన్నని మంటపై, దగ్గర పడేవరకు, ఉడికించాలి.
9. కుర్మా కాస్త దగ్గర పడ్డాక, ఉప్పు, నెయ్యి వేసి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10. అంతే ఆలు బఠాని కుర్మా రెడీ అయినట్లే..

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ