White Hair turn Black: తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేద చిట్కాలు
White Hair turn Black: తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేద చిట్కాలు.. ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. దాని కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితం వస్తుంది.
భృంగరాజ్
భృంగరాజ్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టు కుడుళ్ళను బలంగా చేస్తుంది. భృంగరాజ్ నూనెను క్రమం తప్పకుండా తలకు మసాజ్ చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. నూనె లేదా పొడి రూపంలో ఉపయోగించవచ్చు.
ఉసిరికాయ
ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. ఇది నేరుగా తినవచ్చు. నూనె లేదా పొడి రూపంలో జుట్టుకు పట్టించవచ్చు.
బ్రహ్మి
బ్రహ్మి స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ని మెరుగుపరచడంలో సహాయపడి హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. దీనిని నూనె రూపంలో కూడా ఉపయోగించవచ్చు.
వేప
వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు,తెల్లజుట్టు సమస్యను నివారిస్తాయి. ఇది నూనెగా ఉపయోగించవచ్చు. జుట్టుకు వేపను కూడా అప్లై చేయవచ్చు.
అశ్వగంధ
అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేసి జుట్టు తెల్లబడటాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
గోరింటాకు
గోరింటాకు సహజమైన క్లెన్సర్‌గా పనిచేసి తలపై ఉండే మురికిని, అదనపు నూనెను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల తెల్లజుట్టు రావటాన్ని ఆలస్యం చేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనిని పొడిగా లేదా ఇతర మూలికలతో కలిపి ఉపయోగించవచ్చు.
మెంతులు
మెంతులు హెయిర్ ఫోలికల్స్ బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా తెల్లజుట్టును నివారిస్తుంది. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. ఆ పొడిని నీళ్లతో కలిపి తాగవచ్చు. మెంతులతో పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ