Beauty Tips

Blackhead: బ్లాక్‌ హెడ్స్‌ సమస్య వేధిస్తుందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి.

Blackhead: బ్లాక్‌ హెడ్స్‌ సమస్య వేధిస్తుందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి.. బ్లాక్‌ హెడ్స్‌.. ఇటీవల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందంగా ఉండే ముహం బ్లాక్‌ హెడ్స్‌ కారణంగా అందంకోల్పోతుంది. అయితే బ్లాక్‌ హెడ్స్‌ ప్రతీ ఒక్కరికీ వచ్చే సర్వసాధారణమైన సమస్యే. అయితే వీటిని తొలగించడం పెద్ద కష్టమేమి కాదు.

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు,అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటి వాటితో బాధపడుతున్నారు. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనపడుతుంది.

ఇవి సాదరణంగా గడ్డం మీద, ముక్కు చుట్టూ ,ముక్కు మీద వస్తాయి. వీటి కారణంగా ముఖం జిడ్డుగా,డల్ గా మారిపోతుంది. దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో పావు చెక్క నిమ్మరసం,కొంచెం టూత్ పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని వేడి నీటిలో ముంచిన కాటన్ క్లాత్ తో తుడిచి 5 నిమిషాల పాటు ఆవిరి పెట్టాలి. ఇలా ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలలో ఉన్న మురికి, దుమ్ము,ధూళి శుభ్రం అవుతుంది. ఆ తర్వాత తయారుచేసుకున్న పుదీనా పేస్ట్ లో నిమ్మచెక్కను ముంచి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో ఐదు నిమిషాలు స్క్రబ్బింగ్ చేయాలి.

ఆ తర్వాత పేస్ట్ ని ఆ ప్రదేశంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నచోట కొంచెం గట్టిగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ త్వరగా పోతాయి. ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ