Beauty Tips

White Hair: తెల్లజుట్టు ఉందా? బాదం నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..!

White Hair: తెల్లజుట్టు ఉందా? బాదం నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే.. ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం. ఒక బౌల్ లో 2 స్పూన్ల కలబంద జెల్, 2 స్పూన్ల బాదం నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. కలబంద జెల్, బాదం నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ చిట్కా ఫాలో అయితే చక్కని ఫలితం వస్తుంది. ఏదో ఒక వారం ఈ రెమిడీ ఫాలో అయ్యి సమస్య తగ్గలేదు అంటే కుదరదు. కనీసం 4 వారాల పాటు చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ