Kitchen Tips:చలికాలంలో పెరుగు త్వరగా తోడుకోవాలంటే… ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Kitchen Tips:చలికాలంలో పెరుగు త్వరగా తోడుకోవాలంటే… ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. చలికాలంలో పెరుగును ఎలా తోడు చేయాలి: చలికాలంలో చిక్కగా మరియు పెరుగును తయారు చేయడం చాలా కష్టమైన పని. నిజానికి, చలి కారణంగా పెరుగు …త్వరగా తోడుకోకపోతే.. ఈ విధంగా టిప్స్ ఫాలో అవ్వండి.
పెరుగులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగును రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కొంత మంది పెరుగు పుల్లగా ఉంటే తినటానికి ఇష్టపడరు. పెరుగు పుల్లగా లేకుండా తియ్యగా ఈ చలికాలంలో తోడుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం…వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని,ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు…కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో…కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు…లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది…..శీతాకాలంలో పెరుగు సరిగా తోడుకోదు దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు..అదేంటంటే..
శీతాకాలంలో పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చటి పాలలోనే తోడు వేయాలి…అలాకాకుండా చల్లటి పాలలో తోడు పెడితే అది పాలులానే ఉంటుంది…అలాంటప్పుడు తోడుపెట్టినా తోడుకోకుండా ఉన్న పాలగిన్నెని,ఒక ప్లేట్లో గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో పెట్టాలి.తీయటి పెరుగు చిటికెలో తోడుకుంటుంది.ట్రై చేసి చూడండి.
మిగిలిపోయిన పెరుగు మొత్తంలో పాలు పోసేస్తుంటారు చాలామంది…అలా చేయడం వల్ల పెరుగు పుల్లగా తోడుకుంటుంది.అలాకాకుండా స్పూన్ తో కొంచెం పెరుగు తీసుకుని,పాలల్లో కలిపేస్తే తీయటి పెరుగు తోడుకుంటుంది…
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ