DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:September 21 రాశి ఫలాలు-ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Today Horoscope:September 21 రాశి ఫలాలు-ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. మేష రాశి
ఈ రాశి వారు చేసే పనులలో కొన్ని ఆటంకాలను వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృషభ రాశి
ఈ రాశి వారు అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఈ రాశి వారికీ అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితం పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది.

మిధున రాశి
ఈ రాశి వారు అనవసర ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేసే పని మీద ఎక్కువగా శ్రద్ద పెట్టాలి.

కర్కాటక రాశి
ఈ రాశి వారు చేసే పనులలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. కాస్త జాగ్రత్తగా పనులను చేసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంటె అదృష్టం వస్తుంది. ఆటంకాలు వచ్చిన ముందడుగు వేయాలి.

సింహరాశి
ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.అప్పుడే మంచి పలితాలు వస్తాయి.

కన్యా రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

తులారాశి
ముఖ్యమైన పనులలో మంచి పురోగతి సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధికమిస్తారు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు గొప్ప ఫలితాలను అందిస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారం  అన్న విధంగా వీరి జీవితం ఉంటుంది.

మకర రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు.

కుంభరాశి
ఈ రాశి వారు ఏ పని చేసిన అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ కాస్త ఎక్కువగా పెడితే విజయాన్ని సాధిస్తారు.