Healthhealth tips in telugu

Chia Seeds Water: ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే.. బరువు తగ్గడమే కాదు..

Chia Seeds Water: ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే.. బరువు తగ్గడమే కాదు.. Chia Seeds Water: చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్‌లో కచ్చితంగా చియా సీడ్స్‌ చేర్చుకుంటారు. ఈ విత్తనాలు బరువు తగ్గాడానికే కాదు.. మన ఆరోగ్యాన్ని రక్షంచడానికి సహాయపడతాయి. చియా సీడ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ గింజలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు.
chia seeds
ప్రతి రోజు అరస్పూన్ చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ గింజలను వేసి బాగా కలిపి రెండు గంటల పాటు అలా వదిలేస్తే…ఆ గింజలు జెల్లీ మాదిరిగా ఉబ్బుతాయి. దీనిలో తేనె,నిమ్మరసం కలుపుకొని తీసుకోవచ్చు…లేదంటే స్వీట్స్,ఫలుదా వంటి వాటిలో వేసుకొని తినవచ్చు.

చియా గింజలలో 92 శాతం ఫైబర్ ఉంటుంది. ఈ గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు కాల్షియం వంటి పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు ఈ గింజలను తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
Weight Loss tips in telugu
జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. ప్రేగు కదలికలకు సహాయపడి మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారాలలో చియా గింజలు చాలా ఉత్తమమైనవని నిపుణులు చెప్పుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా రక్తపోటు స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది.
cholesterol reduce foods
చియా గింజలలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చియా గింజలలో B విటమిన్లు, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా చేస్తాయి.
Joint Pains
చియా గింజలలో కాల్షియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్ సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్ ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ