Beauty Tips

Rice Water For Face:బియ్యం నీరు ఇలా ఉపయోగిస్తే.. మీ అందం అమాంతం పెరిగిపోతుంది..!

Rice Water For Face:బియ్యం నీరు ఇలా ఉపయోగిస్తే.. మీ అందం అమాంతం పెరిగిపోతుంది.. బియ్యం నీటిని చాలా మంది పడేస్తారు. బియ్య నీరు ఉపయో గించడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయని ఎవరికి తెలియదు. కొందరు ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి బియ్యం నీటిని వాడుతుంటారు.

అయితే దీన్ని ఉపయోగించడం వల్ల ముఖానికి మేలు జరుగుతుంది. చర్మం కోసం బియ్యం నీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి శతాబ్దాలుగా బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారని నిపుణులు అంటున్నారు. బియ్యం నీరు చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో.. దానివల్ల ఎలాంటి లభాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బియ్యం కడిగిన నీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. బియ్యాన్ని ముందుగా గిన్నెలో పోసి నీటిని పోసి రెండు సార్లు కడిగితే దుమ్ము ధూళి తొలగిపోతాయి. ఇప్పుడు మరల నీటిని పోసి ఒక అరగంట ఆలా వదిలేయాలి. అరగంట అయ్యాక బియ్యాన్ని కలిపితే కాస్త మసకగా ఉన్న నీళ్లు బియంపైనా తేలుతాయి. ఈ నీటిని మరో పాత్రలోకి వంపాలి. అంతే బియ్యం ఆకడిగిన నీళ్లు రెడీ అయినట్టే. ఈ నీటిని ఫ్రిజ్ లో పెట్టుకొని రెండు,మూడు రోజులు వాడుకోవచ్చు.

బియ్యం కడిగిన నీళ్లతో(Rice Water) ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. బియ్యం ఆకడిగిన నీటిలో కాటన్ ముంచి ముఖానికి.మెడకు రాసుకొని రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ముఖం పూర్తిగా ఆరాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. విధంగా ప్రతి రోజు చేస్తే చర్మానికి అవసరమైన పోషణ అంది చర్మం మృదువుగా మెరుస్తుంది.

బియ్యం కడిగిన నీరు (Rice Water) మొటిమల సమస్యకు చక్కని పరిష్కారం. బియ్యం ఆకడిగిన నీటిలో కాటన్ ముంచి ముఖం మీద మొటిమలు ఉన్న ప్రదేశంలో ప్రతి రోజు రాస్తూ ఉంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. మొటిమల సమస్యే కాకుండా నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. బియ్యం కడిగిన నీళ్లు మంచి టోనర్ గా పనిచేస్తాయి. చర్మానికి రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చర్మం మీద ఏర్పడిన రాష్,ఎలర్జీ లు కూడా తగ్గుతాయి.

తలకు షాంపూ పెట్టి తలస్నానము చేసాక బియ్యం కడిగిన నీటిని తలపై పోసుకొని 2 నిముషాలు మసాజ్ చేసుకుంటే జుట్టుకు పోషణ అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఆ తర్వాత సాధారణ నీటిని తలపై పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ