Healthhealth tips in telugu

Mango Leaves Benefits : మామిడి ఆకుల రహస్యం తెలిస్తే డాక్టర్లతో పనుండదు!!

Mango Leaves Benefits : మామిడి ఆకుల రహస్యం తెలిస్తే డాక్టర్లతో పనుండదు.. మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మామిడి చెట్ల ఆకులు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయని అంటున్నారు. మామిడి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు.

మామిడి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫెవోనాయిడ్స్, సాపోనిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ , యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
mango benefits
అలాగే బొప్పాయి పండులో ఉండే ‘పాపిన్’ అనే ఎంజైమ్ ను కూడా మామిడి ఆకులలో ఉంటుంది. మామిడి ఆకులలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టే  పండుగలకు, శుభకార్యాలు జరిగినప్పుడు తప్పనిసరిగా గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టటంసంప్రదాయంగా మన పెద్దలు పెట్టారు. మనలో చాలా మందికి మామిడి పండు,మామిడికాయల గురించి తెలుసు.

కానీ మామిడి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు . మామిడి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఎన్నో రుగ్మతల నివారణకు వాడుతూ ఉంటారు. మామిడి ఆకును నీటిలో మరిగించి లేదా పొడిరూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. మామిడి ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మామిడి ఆకులు నోటి దుర్వాసనను సమర్ధవంతంగా తొలగిస్తుంది. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చిన పొగను పీల్చితేగొంతు సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రెండు మామిడి ఆకులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. కొంత మంది విశ్రాంతి లేకుండా విపరీతంగా పనిచేసి తరచూ అలసిపోయి ఒత్తిడికి గురిఅవుతూ ఉంటారు. అలాంటి వారు మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులో ఉండే పోషకాలు  నాడీవ్యవస్థను రిలాక్స్ చేసి రీ ఫ్రెష్ గా ఉండేలా చేస్తాయి.

కాలిన గాయాలు త్వరగా నయం కావటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చినబూడిదను కాలిన గాయాలపై జల్లితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకులతో తయారుచేసిన టీ త్రాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. మధుమేహాన్ని నివారించడంలో మామిడి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.
Diabetes In Telugu
మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంతో సైనిన్స్ మధుమేహం  ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని , అలాగే వ్యాస్కులర్ రిలేటెడ్ సమస్యలను కూడా నివారిస్తుందని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఒక కప్పు మామిడి ఆకుల టీ త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు సమస్యలు లేకుండా చేస్తుంది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు మామిడి ఆకుల టీ త్రాగితే ప్రయోజనం ఉంటుంది. మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ