Healthhealth tips in telugu

Weight Loss Drink:ఎటువంటి డైట్ ఎక్ససైజ్ లేకుండా నెలలో 5 కేజీల బరువు తగ్గుతారు

Weight Loss Drink:ఎటువంటి డైట్ ఎక్ససైజ్ లేకుండా నెలలో 5 కేజీల బరువు తగ్గుతారు.. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా బరువు తగ్గే మార్గం చూడాలి.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు సమస్య అనేది మనలో చాలా మందిని వేధిస్తోంది బరువు తగ్గించుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆయన పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు
Biryani leaves health benefits In Telugu
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పెద్ద ఆకు అయితే ఒకటి తీసుకోవాలి. చిన్న ఆకు అయితే రెండు తీసుకోవాలి. బిర్యానీ ఆకు లో ఉండే లక్షణాలు శరీరంలో పెరుకుపోయిన విషాలను బయటకు పంపడమే కాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది

ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అరస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చివరగా రెండు యాలకులను వేసుకొని 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి
jeelakarra Health Benefits in telugu
ఈ నీటిలో కావాలంటే నిమ్మరసం తేనె కూడా కలుపుకోవచ్చు లేదా నిమ్మరసం తేనె లేకుండా కూడా తాగవచ్చు ఈ డ్రింక్ ని రోజులో 3 సార్లు అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.