Kitchenvantalu

Curd Poha Recipe:అటుకులు పెరుగుతో 10 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి

Curd Poha Recipe:అటుకులు పెరుగుతో 10 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి.. బ్రేక్‌ఫాస్ట్‌గా అటుకులను మీరు చాలా సార్లు తినే ఉంటారు. అయితే మీరు పెరుగుతో చేసే అటుకులను ఎప్పుడైనా తిన్నారా? పెరుగు పోహా భారతదేశం ఉత్తర భాగంలోని ప్రజలు ఎక్కువగా చేసుకుంటారు.

ఇది మీకు మంచి రిఫ్రెషింగ్ అల్పాహారం అవుతుంది. శరీరాలను చల్లగా ఉంచుతుంది. ఈ వంటకం మనం సాధారణంగా చేసే పెరుగు అన్నం మాదిరిగానే ఉంటుంది కానీ మసాలా కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

స్నాక్స్ గా చేసుకునే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచివి.తేలికైన ఆహారంగా అటుకులకు ఎంతో పేరు.ఇక పెరుగు లేనిదే భోజనం ఫుల్ ఫిల్ అవ్వదు.ఈ పెరుగు, అటుకులతో ఆరోగ్యకరమైన , సంప్రదాయ బద్దమైన మహారాష్ట్ర స్పెషల్.పెరుగు పోహ ఎలా చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మందం అటుకులు – 1 కప్పు
పెరుగు – 1/4కప్పు
నూనె – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
చల్ల మిరపకాయలు – 2
కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం
1.ఇప్పుడొక గిన్నెలోకి కడిగి,ఆరపెట్టిన అటుకులు తీసుకుని,అందులో పెరుగు , ఉప్పు కలపి,పక్కన పెట్టుకోవాలి.
2. తాళింపు కోసం, ఒక పాన్ పెట్టి, అందులో నూనె వేసుకుని, అవాలు, జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు వేసి, తాళింపును అటుకులో కలిపేసుకోవాలి.
3. అంతే బాగా మిక్స్ చేసుకుని వెంటనే తింటే పెరుగు పోహ అదిరిపోతుంది.