Kitchenvantalu

Garlic palak mushroom recipe:ధాబా స్టైల్ గార్లిక్ పాలక్ మష్రూమ్ ఇంటిలో చాలా సులభంగా..

Garlic palak mushroom recipe:ధాబా స్టైల్ గార్లిక్ పాలక్ మష్రూమ్ ఇంటిలో చాలా సులభంగా..పాలకూరతో స్పెషల్ అనగానే,ఠక్కున గుర్తుకు వచ్చే ఐటెమ్.పాలక్ విత్ పన్నీర్.

అదే స్టైల్లో తయారు చేసుకునే,పాలక్ గార్లిక్ మష్రూమ్స్ కూర,చూడటానికి అలాగే కనిపించినా,టేస్ట్ లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది.ట్రై చేయకపోతే,ఈసారి చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు
పాలకూర – 250 గ్రాములు
పచ్చిమిర్చి -3
ఉప్పు – తగినంత
పంచదార – 1 టీ స్పూన్
నీళ్లు – 2 లీటర్లు

కర్రీ కోసం ..
మష్రూమ్స్ – 200 గ్రాములు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు – 1/4కప్పు
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీ స్పూన్
గరం మసాల – 1/2టీ స్పూన్
కారం – 1/2టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
కసూరి మేతి – 1 టీ స్పూన్
ఫ్రెష్ క్రీమ్స్ – 2 టేబుల్ స్పూన్స్
నీళ్లు – 125 ml

తాళింపు కోసం..
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి -2
వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, నీళ్లు వేడి చేసి, మరుగుతున్న నీళ్లలో పాలకూర , ఉప్పు, పచ్చిమిర్చి, చెక్కర వేసి,ఒక పొంగు వచ్చే వరకు ఉంచి, తర్వాత తీసి చల్లని నీళ్లలో వేయాలి.
2.మరో గిన్నెలో నీళ్లు మరిగించి, మష్రూమ్స్ వేసి రెండు నిముషాలు ఉడికించి, వాటిని కూడా చల్లని నీళ్లలోకి మార్చుకోవాలి.
3. ఇఫ్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, నూనె వేసి, అందులోకి ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి.
4. అవి వేగాక, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి.
5. ఉల్లిపాయలు వేగాక, ఉప్పు, పసుపు, వేసి, పాలకూరను పేస్ట్ గా చేసుకుని,అందులో వేసుకోవాలి.
6. మూత పెట్టి పాలకూరపై, నూనె పైక తేలే వరకు ఉడికించాలి.
7. ఇప్పుడు అందులోకి కారం, గరం మసాల, కసూరి మేతి, వేసుకుని కలుపుకోవాలి.
8. అందులోకి నీళ్లు పోసి, ఒక పొంగు వచ్చాక, మష్రూమ్స్ వేసుకుని, ఉడికించాలి.
9. చివరగా నూనె పైకి తేలుతున్న సమయంలో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10. వేరొక పాన్ లో తాళింపు కోసం, నెయ్యి వేసి, అందులోకి ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, వేసుకుని, ఎర్రగా వేపుకుని, పాలక్ మష్రూమ్స్ లోకి వేసుకోవాలి.
11. అంతే గార్లిక్ పాలక్ మష్రూమ్స్ తయారైనట్లే..